కృష్ణా జిల్లా వల్లూరుపాలెం లంక పొలాల్లో విషాదం జరిగింది. పనికోసం అరటితోటలోకి వచ్చిన ఇద్దరు కూలీలను కరెంటుతీగలు బలితీసుకున్నాయి. తోట్లవల్లూరుకు చెందిన డొక్కు రాంబాబు (43), మరీదు నాగరాజు(27) వల్లూరుపాలెం రైతు అరటితోటలో ఎరువులు చళ్లేందుకు వెళ్లారు. పని చేస్తుండగా.. అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు వారి కాళ్లను చుట్టేశాయి. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వారి కేకలతో ఇతర కూలీలు పరుగున వచ్చినా.. ఫలితం లేకపోయింది. వెంటనే విద్యుత్తు అధికారులు, పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
ట్రాన్స్కో ఏఈ సోమేశ్వరరావు, తోట్లవల్లూరు ఎస్సై చిట్టిబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబసభ్యులను చూసి పలువురు కంటతడిపెట్టారు.
విద్యుత్ తీగే యమపాశమైంది... కూలీలను మింగేసింది.... - కరెంటు తీగలు కాటేశాయ్...విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీల మృతి
రెక్కాడితే కానీ డొక్కాడని ఇద్దరు నిరుపేద కూలీలను కరెంటు తీగలు కాటేశాయి. తోటలో పనికి వచ్చిన వారిద్దరిపాలిట మృత్యుపాశాలయ్యాయి. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా వల్లూరుపాలెం లంక పొలాల్లో జరిగింది.
.విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీల మృతి
ఇవీ చదవండి..అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య