ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు .. ప్రశాంతంగా కర్ఫ్యూ - Vijayawada Pandit Jawahar Lal Nehru Bus station News Today

విజయవాడ పండిట్ నెహ్రూ బస్​ స్టేషన్​ నుంచి రోజూ వేలాది సర్వీసులు నడుస్తుంటాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో బస్సులన్నీ బస్సు స్టాండ్​లోనే నిలిచిపోయాయి. ఆ తర్వాత అన్ని రూట్లలో నడిచే స్థానిక, దూర ప్రాంత సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది.

డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు .. ప్రశాంతంగా కొనసాగుతున్న కర్ఫ్యూ
డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు .. ప్రశాంతంగా కొనసాగుతున్న కర్ఫ్యూ

By

Published : May 5, 2021, 8:23 PM IST

డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు .. ప్రశాంతంగా కొనసాగుతున్న కర్ఫ్యూ

కరోనా విజృంభిస్తున్న కారణంగా నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రభుత్వం కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఫలితంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. జిల్లా వ్యాప్తంగా వందలాది ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.

ప్రశాంతంగా కర్ఫ్యూ..

నందిగామ పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అత్యవసర సేవలు మినహా కర్ఫ్యూ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఐ కనకారావు, ఎస్​ఐ తాతాచార్యులు, హరిప్రసాద్ దుకాణాలను దగ్గరుండి మూయించారు. పోలీస్ అధికారులు పట్టణ పుర వీధుల్లో తిరుగుతూ కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.

పట్టణమంతా ఆంక్షలు..

వ్యాపారస్తులు సైతం కరోనా మహమ్మారిపై భయంతో స్వచ్ఛందంగా షాపులు మూసేయడానికి సిద్ధమయ్యారు. కర్ఫ్యూ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టణమంతా ఆంక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలీస్ సిబ్బంది బస్తీలు, వార్డుల్లో తిరుగుతూ షాపులను దగ్గరుండి మూయిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుందని స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు.

వెలవెల..

విజయవాడ పండిట్ నెహ్రూ బస్​ స్టేషన్​ నుంచి రోజూ వేలాది సర్వీసులు నడుస్తుండగా.. కర్ఫ్యూతో బస్సులన్నీ బస్టాండ్​లోనే నిలిచిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సులు నడవగా ఆ తర్వాత అన్ని రూట్లలో నడిచే స్థానిక, దూర ప్రాంత సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బస్టాండ్ మొత్తం బోసిపోయింది. బెజవాడ బస్సు స్టాండ్​లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితిని ఈటీవీ భారత్ ప్రతినిధి వెంకటరమణ వివరిస్తారు.

ఇవీ చూడండి:

మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా వేయాలి: నారాలోకేశ్

ABOUT THE AUTHOR

...view details