ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో కరోనా రెండో డోస్ కోసం తరలివచ్చిన జనాలు

కృష్ణాజిల్లా నందిగామ జిల్లా పరిషత్ పాఠశాల్లో కొవిడ్ రెండో డోస్ కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీకా కార్యక్రమం జరిగింది.

కరోనా టీకా కోసం పెద్ద ఎత్తున తరిలివచ్చిన ప్రజలు
కరోనా టీకా కోసం పెద్ద ఎత్తున తరిలివచ్చిన ప్రజలు

By

Published : May 15, 2021, 8:58 PM IST

కృష్ణా జిల్లా నందిగామ జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం కొవిడ్ రెండో డోస్ కోసం పెద్ద ఎత్తున ప్రజలు వ్యాక్సిన్ కేంద్రానికి తరలివచ్చారు. ముందు జాగ్రత్తగా వైద్య సిబ్బంది మొదటి డోసు తీసుకొని నెలరోజులు నిండిన వారికి సీరియల్ ప్రకారం టోకెన్లు ఇచ్చారు. అయినప్పటికీ పట్టణంలో టోకెన్లు పొందిన వారందరూ ఒకేసారి రావడంతో రద్దీ పెరిగింది.

మున్సిపాలిటీ వారు షామియానాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి చాలక ఎండలో కూడా నిలబడాల్సి వచ్చింది. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారికి, వైద్య సిబ్బందికి.... మున్సిపాలిటీ వారు కనీసం మంచినీటి సౌకర్యం కల్పించకపోవడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మూడు చోట్ల వ్యాక్సిన్ వేసినప్పటికీ సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో వ్యాక్సిన్ వేయడం చాలా ఆలస్యమైంది.

ఇదీ చదవండి:

అనుబంధ పరిశ్రమలే ఆసరా!

ABOUT THE AUTHOR

...view details