కృష్ణా జిల్లాలో నివర్ తుపాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాల్లో వరి పంట వేయగా... సుమారుగా 3లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట వానలకు పాడైంది. తుపాన్ ప్రభావంతో పంట కాల్వలు, మురుగు కాల్వలు పొంగి పొర్లాయి. వరి పంట దాదాపుగా నేలకొరిగింది. అధిక ఖర్చుతో కోయించిన వరి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
బాపులపాడు
జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చాలా మండలాల్లో పంట నష్టం జరిగింది. జిల్లాలోని బాపులపాడు మండలం, విజయవాడ రూరల్ మండలాల్లో కోతకు వచ్చిన పంట తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించాలని రైతన్నలు కోరారు.