కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పసుపు, మొక్కజొన్న తడిసిపోయాయి. అమ్మకానికి సిద్ధంగా ఉన్న పంట.. నీటి మూటగా మారింది. ఈ అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
అకాల వర్షం.. అపార నష్టం - కృష్ణా జిల్లాలో వర్షం
అకాల వర్షం రైతన్నకు అపార నష్టాన్ని మిగిల్చింది. శనివారం కురిసిన భారీ వర్షానికి చేతికందిన పంట తడిసిపోయింది. పసుపు, మొక్కజొన్న లాంటి పంటలు సాగు చేసిన వారికి తీవ్ర నష్టం వాటిల్లింది.
అకాల వర్షంతో పంట నష్టం