కృష్ణా జిల్లాలోని కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి , చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో కురిసిన అకాల వర్షానికి... చేతికొచ్చిన పంట నేలకొరిగింది. ఆరు మండలాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి వందలాది ఎకరాల్లో వరిపంట నెలకొరిగింది. ఆకస్మిక వర్షాలతో నష్టపోయిన తమను ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
అకాల వర్షంతో వందలాది ఎకరాల్లో పంట నష్టం - కృష్ణా జిల్లా నేటి వార్తలు
కృష్ణా జిల్లాలో ఆకస్మికంగా కురిసిన వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట చేతికొచ్చి, ఈ సారైనా అప్పుల ఊబి నుంచి బయటపడతామనుకున్న అన్నదాతలను మరింత కష్టాల్లోకి నెట్టేసింది.
అకాల వర్షంతో వందలాది ఎకరాల్లో పంట నష్టం