నివర్ తుపాను కారణంగా కృష్ణాజిల్లా గన్నవరంలోని ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలాల్లో వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కోత అనంతరం ఎండబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాపులపాడు మండలం వీరవల్లి, రంగన్నగూడెం పంట పొలాల్లో అకాల వర్షాలకు ధాన్యం తడిచి మొలకెత్తింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా పాడవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసరపల్లి-సావరగూడెం ప్రధాన రహదారి వెంట సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఎటు చూసినా ఆరబెట్టిన ధాన్యమే కనిపిస్తోంది.
తడిసి మొలకెత్తిన వరి ధాన్యం...ఆరబెడుతున్న రైతులు - paddy crop lost news
నివర్ తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. నీట మునిగిన వరి మొలకెత్తటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా గన్నవరంలో ఎక్కడ చూసినా ధాన్యం ఆరబెడుతూ కనిపిస్తున్నారు.
మొలకెత్తిన వరి ధాన్యాన్ని చూపుతున్న రైతులు