కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లోని ఈలచెట్లదిబ్బ గ్రామానికి అనుకుని ఉన్న కృష్ణానదిలో ఓ మొసలి కళేబరం లభ్యమైంది. దీనిని చూసేందుకు సమీప ప్రాంతాల్లోని ప్రజలు వచ్చారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. నాచుగుంట గ్రామానికి అయిదు కిలోమీటర్ల దూరంలోని కృష్ణానది సంగమ ప్రాంతంలో కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం ఉంది. మొసళ్ల కారణంగా అభయారణ్యం పరిధిలో చేపల వేటకు వెళ్లేందుకు స్థానిక మత్స్యకారులు భయాందోళనలకు గురవుతున్నారు.
కృష్ణానదిలో మొసలి కళేబరం... భయాందోళనలో మత్స్యకారులు - krishna district latest news
కృష్ణా జిల్లా ఈలచెట్లదిబ్బ గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో మొసలి కళేబరం లభ్యమైంది. ఫలితంగా అప్రమత్తమైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
కృష్ణా నదిలో మొసలి మృతదేహం లభ్యం