కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల వద్ద కృష్ణానదిలో మొసలి సంచరిస్తోందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నది మధ్యలో ఈదుకుంటూ వెళ్తున్న మొసలిని చరవాణిలో చిత్రీకరించిన స్థానికులు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. గతంలోనూ వరదల సమయంలో మొసళ్ళు వచ్చినా అవి చిన్న పిల్లలని, ఇది పెద్ద పరిమాణంతో ఉందని అన్నారు. ఎవరికీ ప్రాణాపాయంలేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కృష్ణా నదిలో మొసలి.. భయాందోళనలో స్థానికులు - కృష్ణా నదిలో ముసలి
కృష్ణానదిలో మొసలి సంచరిస్తోందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నది మధ్యలో ఈదుకుంటూ వెళ్తున్న మొసలిని చరవాణిలో చిత్రీకరించిన స్థానికులు .. ఆ వీడియోని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.
crocodile at krishna river