ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్.. రూ. లక్షా 70 వేలు స్వాధీనం - vijayawada crime news

కృష్ణా జిల్లాలో.. క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి లక్షా 70 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

bukies in arrest in vijayawada
విజయవాడలో క్రికెట్ బుకీలు అరెస్ట్

By

Published : Apr 22, 2021, 8:16 AM IST

కృష్ణా జిల్లా విజయవాడ నగర శివార్లలో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముఠాను ఎస్ఈబీ పోలీసులు అరెస్ట్ చేశారు. రామవరప్పాడు సిండికేట్ బ్యాంక్ కాలనీలో ఆంజనేయులు, ఇంతియాజ్, రవూఫ్ ఇల్లు అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్​లోని రాజేంద్ర అనే వ్యక్తి నుంచి ఆన్ లైన్ లింక్ ద్వారా విజయవాడలో దందా సాగిస్తున్నాడు. సెల్ ఫోన్ ఆధారంగా పందెంరాయుళ్లతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులను కనిపెట్టారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రూ. లక్షా 70 వేలు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details