రాష్ట్ర నిర్మాణ రంగంలో క్రెడాయ్ కీలకంగా వ్యవహరిస్తుందని... తమ మద్దతు పూర్తిగా ఉంటుందని విజయవాడ మధ్య నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బందరురోడ్డులోని ఓ హోటల్‌లో క్రెడాయ్ విజయవాడ ఏడో ప్రాపర్టీ షో బ్రోచర్‌ను మల్లాది విష్ణు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది మాట్లాడారు. ఏటా జనవరి 10, 11, 12 తేదీల్లో విజయవాడ ఏ కన్వెషన్ సెంటర్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వహించడం... అభినందించదగ్గ విషయమన్నారు. 1200 మంది సభ్యులు కలిగిన క్రెడాయ్... మరిన్ని నిర్మాణాలు చేపట్టాలని ఆకాక్షించారు. ఇసుక లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో తనకు తెలుసునని... స్టాక్ ఉన్న రీచ్‌లలో ఇసుకను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. నిర్మాణరంగంతో పాటు సమాజ సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగించాలని కోరారు.
'నిర్మాణ రంగంలో క్రెడాయ్ కీలకంగా వ్యవహరిస్తోంది' - creeday 7th property news in telugu
రాష్ట్ర నిర్మాణ రంగంలో క్రెడాయ్ కీలకంగా వ్యవహరిస్తుందని... తమ మద్దతు పూర్తిగా ఉంటుందని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. క్రెడాయ్ విజయవాడ ఏడో ప్రాపర్టీ షో బ్రోచర్‌ను మల్లాది విష్ణు ఆవిష్కరించారు.
నిర్మాణ రంగంలో క్రెడాయ్ కీలకంగా వ్యవహరిస్తోంది