ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దసరా వేడుకల కోసం నృత్య శిక్షణ - బెజవాడ

దసరా సంబరాలు దగ్గర పడుతున్న తరుణంలో బెజవాడలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. గుజరాతీ దసరా సంబరాల్ని విజయవాడ ఎస్​ఎస్​ కన్వేన్షన్ హాల్​లో నిర్వహించేందుకు క్రియేటివ్ సోల్ సంస్థ దాండియా, గార్భా నృత్యాల శిక్షణనిస్తోంది.

విజయవాడలో గుజరాతీ నృత్య ప్రదర్శనకు శిక్షణ

By

Published : Sep 18, 2019, 3:15 PM IST

విజయవాడలో గుజరాతీ నృత్య ప్రదర్శనకు శిక్షణ
బెజవాడవాసులకు గుజరాతీ దసరా సంబరాల ఆనందాన్ని పంచేందుకు క్రియేటివ్ సోల్ సంస్థ సిద్ధమవుతోంది. మూడేళ్లుగా విజయవాడలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని క్రియేటివ్ సోల్ సంస్థ దాండియా, గార్భా నృత్య ప్రదర్శనలను నిర్వహిస్తోంది. ఈనెల 19వ తేదీ నుంచి వారం రోజుల పాటు సభ్యులకు నృత్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు క్రియేటివ్ సోల్ వ్యవస్థాపకులు సుమన్ మీనా, నేహా జైన్ తెలిపారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ సెంటర్​లో ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 28న దాండియా, గార్భా మెగా ఈవెంట్​ను నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్​లో నిర్వహించనున్నారు. మూడేళ్లుగా దసరా ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న ఈ హంగామాకు గుజరాతీలతో పాటు బెజవాడ వాసులు సైతం ఆసక్తి తిలకిస్తున్నారు.


ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details