విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలోని మూడవ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది... వాహనదారులకు కొవిడ్ 19పై వినూత్నంగా అవగాహన కలిగిస్తున్నారు. సింగ్ నగర్ ప్రాంతంలో రద్దీగా ఉండే బుడమేరు కట్ట గోడలపై.. ఏపీ పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా చిత్రాలు గీయించారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే ప్రయత్నం చేశామని ట్రాఫిక్ ఏసీపీ హుస్సేన్ తెలిపారు.
కరోనాపై వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులు
కృష్ణా జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలోని బుడమేరు కట్ట గోడలపై.. కరోనా ప్రచార చిత్రాలతో.. ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
create awareness on corona in krishna dst Vijayawada