ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైళ్లలో టపాసులు తరలిస్తే కఠిన చర్యలు : దమ.రైల్వే

దీపావళి పండుగ నేపథ్యంలో రైళ్లు సహా రైల్వే స్టేషన్ల పరిధిలో టపాసులు, ఇతర పేలుడు పదార్ధాలను రవాణా చేస్తే కఠిన కేసులు నమోదు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది. టపాసులు, పేలుడు పదార్థాల రవాణా నిషేధం ఉన్న దృష్ట్యా ప్రయాణికులెవరూ వీటిని తీసుకెళ్లవద్దని సూచించింది.

By

Published : Nov 10, 2020, 11:06 PM IST

రైళ్లలో టపాసులు నిషేధం.. కాదంటే కఠిన చర్యలు : దమ.రైల్వే
రైళ్లలో టపాసులు నిషేధం.. కాదంటే కఠిన చర్యలు : దమ.రైల్వే

రైళ్లు సహా రైల్వే స్టేషన్ల పరిధిలో టపాసులు, ఇతర పేలుడు పదార్ధాలను రవాణా చేస్తే కఠిన కేసులు నమోదు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరికలు జారీ చేసింది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో టపాసులు, పేలుడు పదార్థాల రవాణా నిషేధం ఉన్న కారణంగా వీటిని తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

ప్రత్యేక నియంత్రణ చర్యలు..

పండగ సీజన్‌ దృష్ట్యా రైళ్లు, రైల్వే ప్రాంగణాల్లో టపాసులు, మండే స్వభావం కలిగిన వస్తువులను వెంట తీసుకెళ్లకుండా ప్రత్యేక నియంత్రణ చర్యలను చేపడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.

పేలుడు పదార్థాలు భద్రతకు ముప్పు..

రైళ్లు, రైల్వే స్టేషన్లలో పేలుడు పదార్థాలను తీసుకెళ్లడం భద్రతకు తీవ్ర ముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది. సమీపంలోని ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమిస్తాయని.. ఈ విషయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ తరహా వస్తువులను తీసుకెళ్లడం రైల్వే చట్టం- 1989 సెక్షన్‌ 67 ప్రకారం నిషేధమని వివరించింది. సెక్షన్‌ 164, 165 ప్రకారం శిక్షార్హమైందని గుర్తు చేసింది.

హెల్ప్‌ లైన్‌ నెం.182కి సమాచారం అందించాలి..

రైళ్లలో లేదా స్టేషన్లలో టపాసులు లేదా అనుమానాస్పద వస్తువులు, ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు, మండే స్వభావం ఉన్న వస్తువులను ప్రయాణికులు గమనిస్తే రైల్వే సిబ్బంది, సెక్యూరిటీ హెల్ప్‌ లైన్‌ నెం.182కి ఫోన్ చేసి సమాచారం అందించాలని స్పష్టం చేసింది.

నిఘా ఉంచుతాం..

అన్ని ప్రధాన స్టేషన్ల వద్ద రైల్వే భద్రతా సిబ్బంది ప్రత్యేక బృందాలను, క్విక్‌ రియాక్షన్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సాధారణ దుస్తుల్లో ఉండి స్నిఫర్‌ డాగ్స్‌ సాయంతో నిషేధిత వస్తువులను తీసుకెళ్లే ప్రయాణికులపై అధికారులు నిఘా ఉంచుతామన్నారు.

ఇవీ చూడండి : అసెంబ్లీలో పేద ప్రజల గొంతుకనవుతా: రఘునందన్​

ABOUT THE AUTHOR

...view details