తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహ ఆలయ రథం దగ్ధం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. బాధ్యులైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.
ఈ ఘటనను సాకుగా చేసుకుని కొన్ని సంస్థలు, పార్టీలు మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆందోళనలు చేస్తున్నాయని విమర్శించారు. ఇటువంటి ప్రయత్నాలను అధికార యంత్రాంగం తక్షణం అరికట్టాలన్నారు.