రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని, లాక్ డౌన్ కాలంలలో బిల్లులను రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. బిల్లులను ఉపసంహరించుకోకపోతే దశలవారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారు.