వలస కూలీలకు ప్రభుత్వం కంటే ప్రజలే ఎక్కువ సాయమందిస్తున్నారని సీపీఎం నేత మధు పేర్కొన్నారు. సంపద సృష్టించే వలస కూలీలపై లాఠీఛార్జ్ చేయడం అమానుషమన్నారు. పోలీసులు తీరును నిరసించిన తమపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటి వరకు వారికి ఆహారం, వసతి కల్పించాలని కోరారు.
'ప్రభుత్వం కంటే ప్రజలే ఎక్కువ సాయం చేస్తున్నారు' - ఏపీలో వలస కూలీల ఇబ్బందులు
వలస కూలీలపై ప్రభుత్వ వైఖరిని సీపీఎం నేత మధు తీవ్రంగా తప్పుబట్టారు. వలస కూలీలపై లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ తాము నిరసన తెలిపితే... అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు.
cpm protest
కేంద్రం తీసుకువచ్చే విద్యుత్ సవరణలను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించాలని... లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని మధు పేర్కొన్నారు. ఉచిత రేషన్లో ఇచ్చిన శనగలు పూర్తిగా పాడైపోయాయని... రాళ్లతో ఉన్న శనగలను పంపిణీ చేశారని ఆరోపించారు. తక్షణమే శనగలు పంపిణీ చేసిన కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి