ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యుత్ భారం మోపడం సంక్షేమ పథకంలో భాగమా?' - విజయవాడలో సీపీఎం నేతల ధర్నా వార్తలు

వైకాపా ప్రభుత్వంపై సీపీఎం నేత బాబురావు విమర్శలు గుప్పించారు. ఏడాది పాలనలో ప్రజలపై అధిక ఛార్జీల మోత తప్ప సంక్షేమ పథకాలేవీ అమలు చేయలేదని విమర్శించారు. లాక్ డౌన్ లాంటి కష్ట సమయంలో కరెంట్ బిల్లులు పెంచడం న్యాయమేనా అని ప్రశ్నించారు.

cpm protest in vijaywada against high electricity charges
విజయవాడలో సీపీఎం నేతల ఆందోళన

By

Published : Jun 4, 2020, 3:27 AM IST

ప్రజలపై విద్యుత్ భారం మోపడం సంక్షేమ రాజ్యంలో భాగమా అంటూ సీపీఎం నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. పెంచిన కరెంట్ బిల్లులకు వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళనలు చేశారు. పార్టీ నేత సీహెచ్. బాబురావు మాట్లాడుతూ... ప్రజలపై ఛార్జీలు భారం మోపి.. సంక్షేమ పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

ఏడాది పాలనలో 90 శాతం హామీలు నెరవేర్చినట్లు తప్పుడు ప్రచారాల చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు 200 యూనిట్ల లోపు వారికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని నిలదీశారు. లాక్ డౌన్ కష్టాలకోర్చి ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే.. వారికిచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి.. తిరుమలను సందర్శించిన ఎస్పీ రమేష్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details