ఇళ్ల పంపిణీ కార్యక్రమం మూడోసారి వాయిదా వేయటం పేద ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని సీపీఎం నేత బాబూరావు మండిపడ్డారు. విజయవాడలో ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదాపై సీపీఎం ఆధ్వర్యంలో పేదలు నిరసన చేపట్టారు. కోర్టు కేసుల సాకుతో మరోసారి ఇళ్ల పంపిణీ వాయిదా వేయటం మోసపూరితమని, 4లక్షల ఇళ్లను నిర్మించి పేదలకు కేటాయించవద్దని ఏ కోర్టు చెప్పిందని నిలదీశారు. 30 లక్షల ఇళ్ల పంపిణీ చేయవద్దని కోర్టు ఆదేశించిందని చెప్పడం ప్రజలను పక్కదారి పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇళ్ల పంపిణీ వాయిదా వేయటం మోసపూరితం
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేయటంతో... పేదలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని సీపీఎం నేత బాబూరావు మండిపడ్డారు. విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో నిరుపేదలు ఆందోళన చేపట్టారు.
ఇళ్ల పంపిణీ వాయిదా వేయటం మోసపూరితం