అమరావతి రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ విజయవాడలో సీపీఎం నిరసన చేపట్టింది. రాజధాని విషయంలో వైకాపా మోసం చేస్తే, భాజపా ద్రోహం చేసిందని ఆ పార్టీ నేత సీహెచ్ బాబురావు విమర్శించారు.
బాబురావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఏకాభిప్రాయంతో అమరావతిని రాజధానిగా గుర్తించారన్నారు. నాడు ఒప్పుకుని నేడు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు ఏర్పాటు చేయడం జగన్కు తగదన్నారు. రాష్ట్రంలో ప్రజలు, అమరావతి రైతులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నా ఏకపక్షంగా, మొండిగా 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. అమరావతిలో అవినీతి జరిగిందని భావిస్తే విచారణ చేయించాలని కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా అంటూ ప్రశ్నించారు.