ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రక్షణ గోడ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలి: సీపీయం - కృష్ణా కరకట్టపై రక్షణ గోడ వార్తలు

కరకట్ట పరిరక్షణ కోసం డిమాండ్ చేస్తూ సీపీయం ఆధ్వర్యంలో పాదయాత్రను ప్రారంభించారు. కృష్ణా కరకట్టకు రక్షణ గోడ నిర్మించి ప్రజలకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు ఆరోపించారు. తక్షణమే రక్షణ గోడ నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

cpm party
cpm party

By

Published : Nov 1, 2020, 9:34 PM IST

కృష్ణా కరకట్టకు రక్షణ గోడ కట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని సీపీయం నేతలు విమర్శించారు. కృష్ణానది వరద బాధితులకు సహాయం అందించటంలోనూ పూర్తి విఫలమైందని ఆ పార్టీ నేత బాబురావు ఆరోపించారు. సీపీయం ఆధ్వర్యంలో కరకట్ట పరిరక్షణ కోరుతూ విజయవాడ కృష్ణలంకలో పాదయాత్రను చేపట్టారు. కరకట్టపై రక్షణ గోడ నిర్మిస్తామని చెప్పి సంవత్సరం గడిచినా తట్టెడు మట్టి తవ్వలేదని దుయ్యబట్టారు. కరకట్ట పరిధిలోని పేదల ఇళ్లను తొలగిస్తే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details