విజయవాడ పట్టణంలో ఉపాధి భరోసా కేంద్రాలు ప్రారంభించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. లాక్డౌన్ కారణంగా నిర్మాణ రంగం కుదేలైందని తెెలిపారు. లాక్డౌన్ను సడలించడం మాత్రమే కాదు, ప్రజలకు తక్షణ సాయం చేయాలని ఆ పార్టీ నేత బాబురావు కోరారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని పలు డివిజన్లలో ఆయన పర్యటించి, పలు చౌక డిపోలలో బియ్యం నాణ్యతను పరిశీలించారు. పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. అదేవిధంగా...ప్రజలకు ఉపాధి హామీ కల్పించి, కార్మికులకు వేతనాలు కచ్చితంగా ఇవ్వాలన్నారు. కార్మికుల ఉపాధిపై వాలంటీర్లతో సర్వే చేయించి...పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు.
'ఉపాధి భరోసా కేంద్రాలు ప్రారంభించాలి' - ఈటీవీ భారత్ తాజా వార్తలు
కృష్ణాజిల్లాలోని విజయవాడ పట్టణంలో ఉపాధి భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. లాక్డౌన్ కారణంగా భవన నిర్మాణ రంగం కుదేలవ్వడంతో పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ పార్టీ నేత బాబురావు తెలిపారు. ప్రభుత్వం వెంటనే, కార్మికులకు తక్షణ సాయంతో పాటు....నిర్మాణ రంగం కోలుకోవడానికి వీలుగా, ప్రత్యేక రాయితీలను కల్పించాలన్నారు.

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ఉన్నా, తక్షణ ఆర్థిక సాయం ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారని...వారిని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఇసుక కొరత, ఆ తర్వాత లాక్డౌన్, ఇప్పుడు ఇసుక, సిమెంట్ ధరలు అధికమవ్వడంతో...నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని తెలిపారు. భవన నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సాయంతో పాటు, నిర్మాణ రంగం కోలుకోవడానికి వీలుగా...ప్రభుత్వం ప్రత్యేకమైన రాయితీలను ప్రకటించాలన్నారు.
ఇదీ చదవండి