CPM: ఎవరిని ఉద్దరించడానికి ప్రభుత్వం గృహసారథులను నియమిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు మధు విమర్శించారు. నేడు రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన నిధులు వారు వినియోగించే పరిస్థితి లేదన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్చంచ్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉందన్నారు.
ఎవరిని ఉద్దరించడానికి ప్రభుత్వం గృహసారథులను నియమిస్తోంది: మధు
CPM: ఎవరిని ఉద్దరించడానికి ప్రభుత్వం గృహసారథులను నియమిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు మధు విమర్శించారు. నేడు రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన నిధులు వారు వినియోగించే పరిస్థితి లేదన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్చంచ్ ల పరిస్థితి మరింత ఘోరంగా ఉందన్నారు. ఏదైనా అభివృద్ది పని చేద్దాం అంటే నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఏదైనా అభివృద్ది పని చేద్దాం అంటే నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రారంభంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చామని చెప్పారని గుర్తు చేశారు. నేడు వాలంటీర్లపై కూడా నమ్మకం లేకపోవడంతో ప్రభుత్వం గృహ సారథులను తీసుకువస్తోందని ఆరోపించారు. గృహ సారథులు ప్రజా సమస్యలు పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు పరిస్థితి ఏంటన్నారు. ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలంటే ముఖ్యమంత్రి జగన్ విపక్షాలను, ప్రజా సంఘాలను కలవరని ఆరోపించారు. గృహసారథుల నియమకం ఆలోచనను ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: