ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా, వైకాపాలపై మండిపడ్డ సీపీఎం నేత బాబురావు - krishna district latest news

కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడకు మణిహారం లాంటిదని సీపీఎం కార్యదర్శి సి.హెచ్ బాబురావు తెలిపారు. కానీ ఫ్లైఓవర్ నిర్మాణ జాప్యానికి బాధ్యులెవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

మాట్లాడుతున్న సీపీఎం నేత బాబురావు
మాట్లాడుతున్న సీపీఎం నేత బాబురావు

By

Published : Oct 18, 2020, 2:16 PM IST

కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం కావటంతో నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆనందిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్. బాబురావు తెలిపారు. కానీ బ్రిడ్జి గొప్పతనం మాదంటే మాదని కేంద్రంలో ఉన్నా భాజపా, రాష్ట్రంలో వైకాపా, తెదేపా పోటీలు పడుతున్నాయని ఆయన విమర్శించారు. రెండేళ్లలో పూర్తి కావాల్సిన బ్రిడ్జి నిర్మాణం.. ఐదేళ్లు కావడానికి బాధ్యులు ఎవరో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. నగర అభివృద్దికి అవసరమైన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details