ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటింటీకి రేషన్ పథకం విఫలం: బీవీ రాఘవులు

ఇంటింటీకి రేషన్ బియ్యం అనేది భారతంలో పద్మవ్యూహంలా ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. పద్మవ్యూహంలో ప్రజలందరూ సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుందని అన్నారు. రేషన్ పథకంలో మూడు కౌంటర్లు ఉన్నాయని... వాలంటీర్, డిపో, డోర్ డెలివరీల వల్ల ప్రజలకు ఎటు వెళ్లాలో అర్థంకాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

By

Published : Feb 24, 2021, 5:59 PM IST

bv raghavulu
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు

ఇంటింటీకి రేషన్ అనేది భారతంలో పద్మవ్యూహంలా మారిపోయిందని.. ప్రజలు పద్మవ్యూహంలో సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. విజయవాడలో రేషన్ ఫథకం వల్ల ఇబ్బందులపై ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇంటింటికి రేషన్ పథకం విఫలమైందని అన్నారు. వాలంటీర్, డిపో, డోర్ డెలివరీల వల్ల ప్రజలకు ఎటు వెళ్లాలో అర్థంకాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచన చెయ్యాలని.. గతంలో ఉన్న డిపోల ద్వారానే రేషన్ అందించాలని ఆయన సూచించారు.

ABOUT THE AUTHOR

...view details