కొవిడ్ సెంటర్‌గా ఉన్న విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో పది మంది చనిపోవడం బాధాకరమని సీపీఎం నేత బాబూరావు అన్నారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను కొవిడ్ ఆస్పత్రిగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.
'ఇందిరాగాంధీ స్టేడియాన్ని కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చాలి' - vijayawada latest news
విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన ఘటనపై స్థానిక సీపీఎం నేత బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియాన్ని కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చాలని కోరారు.

విజయవాడలో ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలు