రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు కనీస నిత్యావసరాలు సరఫరా చేయడంలో విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. మద్యం సరఫరా చేస్తూ ఆదాయం పెంచుకుంటుందని ఎద్దేవా చేశారు. కేరళ తరహాలో కనీసం 6 నెలల పాటు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రజలకు నిత్యావసరాలు ఇవ్వాలన్నారు. విద్యుత్ చార్జీలపై 18వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో సబ్ స్టేషన్లు, ఆస్పత్రులు, పాఠశాలలు కట్టడానికి భూముల్లేని పరిస్థితుల్లో.. అభివృద్ధి పేరుతో ఉన్న భూములను అమ్మాలని చూడడం వైకాపా ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ముందెన్నడూ అభివృద్ధి కోసం భూములు అమ్మడం అనేది చూడలేదని దీన్ని సీపీఎం పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు.
'రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 6 నెలలు నిత్యావసరాలు ఇవ్వాలి'
రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలకు ఆహారం, రవాణా ఏర్పాటు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. పెంచిన విద్యుత్ బిల్లులు ఉపసంహరించుకోవాలని కోరింది. కేరళ తరహాలో కనీసం 6 నెలల పాటు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రజలకు నిత్యావసరాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
cpm demands