ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా, తెదేపా, భాజపాలు రైతులకు ద్రోహం చేశాయి' - krishna district news

కార్పొరేట్​ సంస్థలకు అనుకూలంగా కేంద్ర తీసుకువచ్చిన నాలుగు చట్టాలను రద్దుచేయాలని సీపీఎం నాయకులు డిమాండ్​ చేశారు. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో ఆ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. వైకాపా, తెదేపా, భాజపాలు రైతులకు ద్రోహం చేశాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు.

cpm meeting
సీపీఎం భారీ బహిరంగ సభ

By

Published : Dec 29, 2020, 10:40 PM IST

కార్పొరేట్​ సంస్థలకు అనుకూలంగా కేంద్ర తీసుకువచ్చిన నాలుగు చట్టాలను రద్దుచేయాలని కృష్ణా జిల్లా కోడూరు మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. గిట్టుబాటు ధరలపై కేంద్రం చట్టం చేయాలని నాయకులు డిమాండ్​ చేశారు. వైకాపా, తెదేపా, భాజపాలు రైతులను ద్రోహం చేశాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. దిల్లీలో రైతుల ఆందోళన చూస్తుంటే..అప్పట్లో నాయకులు బ్రిటిష్ వారితో పోరాడిన రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు అరికట్టాలని నాయకులు పేర్కొన్నారు. అంతకుముందు గంగానమ్మ గుడి సెంటర్ నుంచి రామారావు స్తూపం సభా ప్రాంగణం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details