అమరావతి సచివాలయంలో హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నారని సీపీఎం నేత బాబూరావు అన్నారు. కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా బకాయిలు పెట్టడం సంక్షేమమా అని ప్రశ్నించారు. సచివాలయంలో వేతనాలు లేక కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన తెలపగా వారికి సీపీఎం మద్దతుగా ఉంటుందని బాబూరావు తెలిపారు. అమరావతిలోని 29 గ్రామాల్లోని పారిశుద్ధ్య సిబ్బందికి ఆరునెలలుగా వేతనాలు కాంట్రాక్టర్లు చెల్లించడం లేదన్నారు. సీఆర్డీఏ కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
వేతనాలు చెల్లించకుండా బకాయిలు పెట్టడం సంక్షేమమా?
ప్రభుత్వంపై సీపీఎం నేత బాబురావు మండిపడ్డారు. సచివాలయంలో హౌస్ కీపింగ్ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇన్ని నెలలు జీతాలు చెల్లించకుంటే వారి జీవనం ఎలా గడవాలని ప్రశ్నించారు.
సీపీఎం నేత బాబురావు
ఇవీ చదవండి