ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్​ ఛార్జీల పెంపుపై సీపీఎం ఆందోళన - కరెంటు బిల్లు ఛార్జీల పెంపుపై సీపీఎం ఆందోళన

లాక్​డౌన్​తో ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఇప్పటికే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారిపై విద్యుత్ ఛార్జీలు పెంచి మరింత భారం మోపటం సరికాదని కృష్ణా జిల్లా నందిగామ ట్రాన్స్​కో కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు ధర్నా చేశారు.

cpm agitation on current bill charges raised in state
కరెంటు బిల్లు ఛార్జీల పెంపుపై సీపీఎం ఆందోళన

By

Published : May 12, 2020, 3:28 PM IST

పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ, కృష్ణా జిల్లా నందిగామ ట్రాన్స్​కో కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, కరెంటు ఛార్జీలు పెంచి పేద ప్రజలపై మోయలేని భారం మోపిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై కరెంటు ఛార్జీలు పెంచటం దారుణమన్నారు. పెంచిన విద్యుత్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details