పెన్షన్లు పునరుద్ధరించాలని ఆందోళన
'పునరుద్దరించకుంటే... ఆందోళనలు తీవ్రతరం చేస్తాం' - పెన్షన్ల తొలగింపుపై విజయవాడలో సీపీఎం నిరసన
అర్హులైన వారి పింఛన్లు తొలగించటాన్ని నిరసిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వృద్ధులు, మహిళలు నిరసన చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుపేదలైన వారి పెన్షన్లు తొలగించటాన్ని సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్ బాబూరూవు తప్పుబట్టారు. తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని.. లేకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

పెన్షన్లు పునరుద్ధరించాలని ఆందోళన