హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగనివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు. నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ప్రభుత్వమే ఏజీ ద్వారా వక్రభాష్యాలు చెప్పించిందని ధ్వజమెత్తారు. అడ్వకేట్ జనరల్ మీడియా సమావేశం పెట్టడం ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు. 2016లో నిమ్మగడ్డ నియామకం చెల్లదని ఏజీ పేర్కొనడం చట్ట ఉల్లంఘనే అని దుయ్యబట్టారు. ఆనాడు రమేశ్‌కుమార్ నియామకంపై ఎవరూ.. ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.
'నిమ్మగడ్డ నియామకం చెల్లదనడం చట్ట ఉల్లంఘనే'
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్‌ఈసీగా విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వం సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. 2016లో నిమ్మగడ్డ నియామకం చెల్లదని ఏజీ పేర్కొనడం చట్ట ఉల్లంఘనే అని దుయ్యబట్టారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ