50శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌కు.. ఇప్పుడు పాస్ మార్కులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అప్పులు తెచ్చి సంక్షేమానికి ఖర్చు పెట్టడం మినహా అభివృద్ధి జాడేలేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే రాజధాని సహా వివిధ అభివృద్ధి పనులను నిలిపివేసి రాష్ట్రంలో అభివృద్ధిని కుంటిపడేలా చేశారన్నారు. విభజన హామీలపై కేంద్రంతో పోరాడే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
'అభివృద్ధిని గాలికొదిలేశారు..అప్పులు తెచ్చి సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారు'
జగన్ రెండేళ్ల పాలనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను గాలికొదిలేశారని విమర్శించారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. విభజన హామీలను విస్మరించారని ఆరోపించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ