పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయకుండా... ప్రాజెక్టును రెండేళ్లలో ఏ విధంగా పూర్తి చేస్తారని విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. జనవరిలో భద్రాచలం నుండి పోలవరం వరకు పాదయాత్ర చేపడుతామన్నారు. జగన్మోహన్ రెడ్డి 6 నెలల పరిపాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల్లో అభద్రతాభావం పెరిగిందని.. ఇసుక కొరత వలన లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏక వ్యక్తి పరిపాలన కొనసాగుతుందని.. మంత్రులు తమ శాఖలపై కనీసం మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు కేవలం ప్రతిపక్షాలను తిట్టడానికే పరిమితమయ్యారని... మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. జనవరి 8వ తేదీన కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
'రాష్ట్రంలో ఏకవ్యక్తి పరిపాలన కొనసాగుతోంది' - polavaram project latest news
ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలు చేసి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ