ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి హయాంలో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే... జగన్, విజయసాయిలకు రాష్ట్ర ప్రజలు రాజకీయంగా సమాధి కడతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారం 100 శాతం ప్రైవేటీకరణ చేస్తుంటే అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి... ఎన్నికల్లో 80 శాతం గెలవాలనే ఫోబియాతో ఉన్నారని విమర్శించారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలంటే ముఖ్యమంత్రి జగన్, దిల్లీలో విజయసాయి రెడ్డి వల్లే అవుతుందన్నారు.
'ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపటం వారిద్దరికే సాధ్యమవుతుంది' - vishaka steel plant updates
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుందని స్పష్టంగా తేలినా సీఎం జగన్ ఇంకా ఎందుకు నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఎన్నికల మీద పెట్టిన శ్రద్ధలో కాస్త విశాఖ స్టీల్‌ప్లాంట్ మీద పెట్టి పరిశ్రమను కాపాడాలని సూచించారు.

రాష్ట్రానికి జగన్, విజయసాయి ఇద్దరు అఘోరాలు మాదిరి తయారయ్యారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సహా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంటే.. రాష్ట్ర భాజపా నాయకులు ప్రైవేటీకరణ చేయడం లేదని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు పెట్రో ధరలపై మాట్లాడినవారు ఇప్పుడు కనీసం నోరు మెదపడం లేదన్నారు. పెట్రో ధరల పెంపు, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేపు చేపట్టే బంద్‌కు పూర్తి మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి