ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: సీపీఐ రామకృష్ణ - news updates in vijayawada

విజయవాడ సీపీఐ కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. సీపీఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో 44 కార్మిక చట్టాలను రద్దు చేశారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

cpi state secretary ramakrihsna
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

By

Published : May 1, 2021, 3:20 PM IST

విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కార్మిక దినోత్సవాలు జరిగాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని... మోదీ అధికారంలోకి వచ్చాక 44 కార్మిక చట్టాలను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు ఒకే వేదిక పైకి వచ్చి పోరాటం చేస్తున్నారని అన్నారు. అంబానీ, ఆదానీ ఆస్తులు రెట్టింపు అవుతుంటే.. పేదవాడు మరింత పేదవానిగా మారుతున్నాడని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details