సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్ వద్ద 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలు చాలా బాధల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. లౌకికవాదానికి పాతర వేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మెుట్టమెుదటి ప్రధాని జవహర్లాల్ నుంచి.. ప్రధాని మోడీ వరకు పబ్లిక్ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ.. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తోందని అన్నారు.
దాసరి భవన్ వద్ద స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలు - సీపీఐ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు న్యూస్
విజయవాడలో దాసరి భవన్ వద్ద సీపీఐ రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాజ్యాంగానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజస్వామ్యాన్ని కాపాడుకునేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తోందన్నారు.
దాసరి భవన్ వద్ద స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలు