భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధి నుంచి రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 20 లక్షల మందిని ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ మార్చి 24న స్వయంగా లేఖ రాసినా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించడం లేదని రామకృష్ణ మండిపడ్డారు. చనిపోయిన వలస కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని అన్నారు. గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యం, గోధుమలు రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసి కార్మికులకు పంచాలని కోరారు. కరోనాను నియంత్రించేందుకు ముందు వరుసలో ఉండి పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని లేకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి
'కేంద్ర మంత్రి చెప్పినా జగన్ స్పందించటం లేదు' - జగన్పై సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు
కార్మికుల సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని కేంద్రం చెప్పినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా చెల్లించటం లేదని ఆరోపించారు.
cpi ramakrishna