CPI Ramakrishna comments on YCP: ప్రధాని మోదీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశంపై స్పష్టత రాలేదని విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడకుండా.. నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికై ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఈనెల 26వ తేదీన ఢిల్లీలో చేపట్టనున్న నిరసనకు మద్దతు ఇస్తున్నామని.. అంతేకాకుండా ప్రత్యక్షంగా నిరసనలో పాల్గొంటామని తెలిపారు.
ప్రధాని పర్యటనలో ఏ ఒక్క అంశంపై స్పష్టత ఇవ్వలేదు: రామకృష్ణ - ప్రధాని
CPI Ramakrishna comments on YCP: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటనలో ఏ ఒక్క అంశంపై స్పష్ట ఇవ్వలేదని..కడప స్టీల్ ఫ్యాక్టరీ మూడు సార్లు చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని రాష్ట్రంలో రైతుల పరిస్థితు దారుణంగా ఉందని ప్రభుత్వం పై మండిపడ్డారు.
జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఇసుక లేదని.. సాక్ష్యాత్తు వైకాపా నేతలే మంత్రికి చెప్పారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి మూడోసారి శంకుస్థాపన చేశారే కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరుతూ డిసెంబర్ 9వ తేదీ నుంచి 5 రోజులపాటు కడప జిల్లాలో పాదయాత్ర చేస్తామన్నామన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన లక్షలాది మంది రైతులు బీమా అందక ఇబ్బంది పడుతున్నారని, బీమా రాని రైతులకు ప్రభుత్వం బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: