కరోనా పేషెంట్ల అంబులెన్సులను తెలంగాణ సరిహద్దులో పోలీసులు నిలిపివేయడం అమానుషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హైదరాబాద్లో మెరుగైన వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే అంబులెన్స్ లను పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడే అధికారం తెలంగాణ పోలీసులకు ఎవరిచ్చారని నిలదీశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.
'రోగుల ప్రాణాలతో చెలగాటమాడే అధికారం ఎవరిచ్చారు?' - today cpi ramakrishna fire on telangana police news update
తెలంగాణ పోలీసుల తీరుపై సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. కరోనా పేషెంట్ల అంబులెన్సులను సరిహద్దులో అడ్డుకోవటంపై ఆగ్రహించారు. పోలీసులకు రోగుల ప్రాణాలతో ఆడుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.
సీపీఐ రామకృష్ణ