సుప్రీంకోర్టు తీర్పు తర్వాతైనా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరిస్తుందని భావించినా.. ఆ పరిస్థితి కనిపించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స.. ఎస్ఈసీని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఏకగ్రీవాలపై ఎందుకు ప్రకటన ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటివద్దకే రేషన్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధం కావటం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికలయ్యేంత వరకు దీన్ని ఆపాలని రామకృష్ణ ఎస్ఈసీని కోరారు.
'ఎస్ఈసీని కించపరిచేలే మాట్లాడటం సరికాదు' - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఎస్ఈసీని కించపరిచేలా మాట్లాడటం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు తర్వాతైనా పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని భావించామని... కానీ ఆ పరిస్థితి కనిపించలేదన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ