ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి' - ఏపీ రైతులపై వరదల ప్రభావం

వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వెంటనే పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు.

cpi rama krishna on crop loss due to floods
పత్తి పంటను పరిశీలిస్తున్నసీపీఐ రామకృష్ణ

By

Published : Oct 17, 2020, 5:20 PM IST

ప్రభుత్వం వరద నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో రామకృష్ణ పత్తిపంటను పరిశీలించారు. వర్షాల కారణంగా మిర్చి, పత్తి, వరి, కూరగాయలు, ఆకు కూరల రైతులు, కౌలు రైతులు పూర్తిగా నష్ట పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పంట నష్టాలపై వాస్తవాలను అంచనాలు వేసి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. సీఎం జగన్ పంటల నష్టాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details