రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ ఆందోళన నిర్వహించింది. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో వారు ధర్నాకు దిగారు. డిపాజిట్ కట్టిన లబ్దిదారులందరికీ టిడ్కో ఇళ్లను కేటాయించాలని.... మంజూరైన వారందరికీ ఇళ్ల పంపిణీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. దీపావళిలోగా మంజూరైన వారందరికీ ఇళ్లను ఇవ్వాలని లేదంటే.. లబ్దిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు.
దీపావళిలోగా లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వాలి: రామకృష్ణ - విజయవాడలో సీపీఐ ఆందోళన
కృష్ణా జిల్లా విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద టిడ్కో నిర్మించిన గృహాల లబ్ధిదారులు సీపీఐ పార్టీ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో సీపీఐ ఆందోళన