ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భూసేకరణపై సీబీఐ విచారణ జరిపించండి' - పేదలకు ఇళ్ల స్థలాలపై సీపీఐ

రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల పేరిట జరుగుతున్న భూసేకరణలో అవినీతి జరుగుతోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. దీనిపై సీబీఐ, లేదా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు.

cpi on lands to poor
పేదల ఇళ్ల స్థలాలపై ముప్పాళ్ల నాగేశ్వరరావు

By

Published : Jul 2, 2020, 12:10 PM IST

రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల పేరుతో జరగుతున్న భూసేకరణలో శాసనసభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ, లేదా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూసేకరణలో అన్ని చోట్లా కుంభకోణాలు జరుగుతున్నాయని.. స్థానిక ఎమ్మెల్యేలు రైతుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు.

పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం ఇస్తే ఇళ్లు నిర్మించుకోవటం సాధ్యమా అని ప్రశ్నించారు. అందుకే పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా దళితులు అనుభవిస్తున్న భూములను పేదల ఇళ్ల స్థలాల పేరిట లాక్కుంటున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర స్థాయిలో పిడుగుల సమాచారమిచ్చేందుకు కొత్త వ్యవస్థ

ABOUT THE AUTHOR

...view details