ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గృహాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి?' - టిడ్కో గృహాల లబ్ధిదారుల సమస్యలు

సీఎం జగన్ టిడ్కో గృహాల సమస్యను పరిష్కరించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ కోరారు. పూర్తైన టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వానికి సమస్య ఏమిటని నిలదీశారు.

CPI narayana on CPI narayana on CPI narayana on
టిడ్కో గృహాలపై సీపీఐ నారాయణ

By

Published : Nov 16, 2020, 12:04 PM IST

టిడ్కో గృహాల నిర్మాణం పూర్తైనా లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. టిడ్కో గృహాల విషయంలో ప్రభుత్వం పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తప్పని పరిస్థితుల్లో సీపీఐ ఇళ్లను ఆక్రమించుకునేందుకు పిలుపు నిచ్చిందని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ పెట్టి సీపీఐ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం తగదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహాలను లబ్ధిదారులకు ఇవ్వడం ఎందుకు ఆలస్యం అవుతుందో ప్రజలకు చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని అణచాలని చూస్తే ఇంకా విజృంభిస్తుందే తప్ప తగ్గదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ పంతాలకు పోకుండా అధికారులు, రాజకీయ పార్టీల నేతలతో చర్చించి ఇళ్ల సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details