రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ప్రమాదంలో పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా నేతలు తమకు అనుకూలంగా తీర్పులు రాకపోతే కోర్టులను సైతం తప్పుబట్టి .. బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మాహేశ్వరిని బదిలీ చేయించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేంద్రంతో లాబీయింగ్ చేసేందుకు జగన్ యత్నిస్తున్నారని నారాయణ అన్నారు. అమరావతి గురించి ప్రశ్నించిన వారిపై.. సామాజిక వర్గం ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీకి కుట్ర జరుగుతోంది' - సీఎం జగన్పై సీపీఐ నారాయణ ఆగ్రహం
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మాహేశ్వరి బదిలీకి కుట్ర జరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జగన్‌కు ఎవరు అడ్డు వచ్చినా తప్పించాలని చూస్తున్నారని ఆరోపించారు. వైకాపా నేతలు తమకు అనుకూలంగా తీర్పులు రాకపోతే కోర్టులను తప్పుబడుతున్నారని దుయ్యబట్టారు.
CPI Narayana on CM Jagan