నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ఎస్ఈసీగా పునర్నియమించాలని గవర్నర్ ఆదేశాలు ఇవ్వడంపట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, గవర్నర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా సీఎం విజ్ఞత ప్రదర్శించాలని హితవు పలికారు. ఈ ఆదేశాలు పాటించకపోతే రాజ్యాంగ సంక్షోభం తప్పదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఎంతటి వారికైనా పట్టువిడుపులు ఉండాలని వ్యాఖ్యానించారు.
'ఈ ఆదేశాలు పాటించకపోతే రాజ్యాంగ సంక్షోభం తప్పదు' - జగన్పై సీపీఐ నారాయణ విమర్శ
నిమ్మగడ్డ విషయంలో జగన్ సర్కారుకు అన్ని దారులు మూసుకుపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం విజ్ఞత ప్రదర్శించాలని హితవు పలికారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
Last Updated : Jul 22, 2020, 1:06 PM IST