ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భాజపా అనైతిక రాజకీయ క్రీడ ఆడుతోంది' - దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మురళీధరన్​ వార్తలు

దిల్లీ పరిస్థితులపై భాజపా ఆడుతున్నది అనైతిక రాజకీయ క్రీడగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభివర్ణించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడైన కన్హయ్య కుమార్​పై కేంద్ర ప్రభుత్వం దేశద్రోహం కింద తప్పుడు కేసు పెట్టిందని మండిపడ్డారు.

cpi narayana comments
భాజాపాపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు

By

Published : Mar 1, 2020, 12:47 PM IST

భాజాపాపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు

దిల్లీ అగ్నిగుండం కావడానికి శాంతిభద్రతల సమస్య కారణం కాదని, ఉద్దేశపూర్వకంగా భాజపా, ఆర్​ఎస్​ఎస్​ కలిసి అల్లర్లు సృష్టించి, అధికారంలోకి రావాలని యత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అల్లర్లకు కారణమైన ముగ్గురు భాజపా నాయకులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన.. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మురళీధరన్​ని బదిలీ చేయించారని వెల్లడించారు. కన్హయ్యపై ఉన్న కేసులను బయటికితోడి అరెస్టు చేయాలని కుట్రపూరితంగా ఆలోచిస్తున్నారని విమర్శించారు. ప్రజాకోర్టులో తాను నిర్దోషినని కన్హయ్య కుమార్ నిరూపించుకున్నాడని, న్యాయ స్థానాల్లోనూ నిర్దోషిగా నిరూపించుకుంటాడన్న నమ్మకం తమకు ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details