రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాలకు అవసరమైన భూముల కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కృష్ణా జిల్లా నందిగామ పట్టణ పరిధిలోని అనాసాగరం వద్ద వరదలో మునిగిన 22 ఎకరాల జగనన్న కాలనీని సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, తెదేపా నాయకులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. రామకృష్ణ మాట్లాడుతూ... మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి రూ.రెండు వేల కోట్లు మాయం చేశారన్నారు.
ఈ విషయం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కూడా తెలుసని సైతం ఆయన పేర్కొన్నారు. అనాసాగరంలో ఎకరానికి రూ.11 లక్షల చొప్పున కాజేశారని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసి కడుతున్న కాలనీలకు జగన్ పేరు ఎందుకని ప్రశ్నించారు. రెండు వారాల్లోపు టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని, లేకపోతే ఆగస్టు పది నుంచి 15వ తేదీలోపు తామే గృహ ప్రవేశాలు చేయిస్తామని తెలిపారు.
ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి