ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆస్తి విలువ ఆధారిత పన్నును రద్దు చేయాలి' - సీపీఐ తాజా సమాచారం

ఆస్తి విలువ ఆధారిత పన్నును రద్దు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ప్రజలను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని.. పార్టీ నేత దోనేపూడి శంకర్ ఆరోపించారు. జీవో రద్దు చేయకుంటే సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

cpi leader dhonepudi shankar
దోనేపూడి శంకర్

By

Published : Jul 4, 2021, 9:18 PM IST

ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపుపై కంటితుడుపు చర్యగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు. పన్ను పెంపు జీవో 198 ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 15 శాతానికి మించి పన్ను పెరగదు అని మంత్రి బొత్స చెప్తున్నారు కానీ.. ఆ అంశం జీవోలో ఎక్కడ లేదన్నారు.

ప్రజలను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు వ్యతిరేకించిన ప్రత్యేక అధికారులతో జీవో తీసుకువచ్చారన్నారని ఆగ్రహించారు. ఆ జీవో రద్దు చేయకుంటే సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details